telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కరోనా​ బాధితులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న సెహ్వాగ్​ ఫౌండేషన్​…

వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్ పేరిట వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ . ఇంట్లో వండిన ఆహారాన్ని కోవిడి బాధితులకు అందజేస్తున్నాడు. ఈ విషయాన్ని సెహ్వాగ్ ఫౌండేషన్ గత నెల 25నే ట్విటర్ వేదికగా ప్రకటించింది. అయితే ఇప్పటివరకు 51వేలకు పైగా కరోనా బాధితులకు ఆహారాన్ని ఉచితంగా అందించినట్లు ఫౌండేషన్ తాజా ట్వీట్‌లో వెల్లడించింది. దీంతో పాటు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంది. ఇంకా ఎవరైనా బాధితులు అన్నం లేక అలమటించినట్లయితే తమను సంప్రదించాలని కోరింది. తమకు సహాయం చేయాలనుకున్న వారు virenderfoundation84@upiకి విరాళాలు అందించాలని తెలిపింది. కోవిడ్‌పై జరుగుతున్న పోరాటంలో క్రీడాకారులంతా భాగస్వామ్యులవుతున్నారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ రూ.2 కోట్ల విరాళంతో పాటు ఫండ్ రైజింగ్ క్యాంపైన్ చేపట్టారు. శిఖర్ ధావన్​, యుజ్వేంద్ర చాహల్, రిషభ్ పంత్, జయదేవ్​ ఉనద్కత్, ప్యాట్ కమిన్స్ తదితర ఆటగాళ్లు తమకు తోచిన సాయాన్ని అందించారు.

Related posts