telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అప్పుడే మద్యం నిషేధించి ఉంటే… వైరాముత్తుకు చిన్మయి కౌంటర్

Chinmayi

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కొన్ని రోజుల క్రితం తమిళ చిత్ర పరిశ్రమలో గేయ రచయితగా బాగా పేరొందిన వైరాముత్తు తనను లైంగికంగా వేధించారని చెప్పి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల వైరాముత్తు ప్రముఖ కవి తిరువల్లువూరు జయంతి సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరువల్లువూర్ విగ్రహానికి పూల మాల వేసి ప్రసంగం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తమిళనాడులో మద్యపానమే ఓ పెనుభూతంలా మారింది. మగవారు మద్యం తాగితే వారి కాలేయాలనే కాదు కుటుంబాన్ని కూడా కోల్పోతారు. అంతేకాదు ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగేది మద్యం సేవించడం వల్లే. కాబట్టి మద్యాన్ని నిషేధించండి” అని అన్నారు. ఓ నెటిజన్ వైరాముత్తు ప్రసంగించిన వీడియోను చిన్మయికి ట్యాగ్ చేశాడు. ఈ వీడియో చూసిన చిన్మయి స్పందిస్తూ “20, 30 ఏళ్ల క్రితమే మద్యాన్ని నిషేధించి ఉండుంటే.. వైరాముత్తు నాపై చేసిన లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేదాన్ని’’ అంటూ కౌంటర్ వేశారు.

Related posts