telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. భారీ లక్ష్యంతో చిక్కుల్లో .. బంగ్లాదేశ్ .. ఎన్ని చేసినా పాక్ సెమీస్ కి కష్టమే..

pak scored 314 runs on bangladesh in world cup match

నేటి ప్రపంచ కప్ మ్యాచ్ లో భాగంగా పాక్-బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. సెమీస్ పై కన్నేసిన పాక్ తీవ్రంగానే పోరాడుతుంది.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(100) శతకంతో చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. 99 బంతుల్లో 7ఫోర్ల సాయంతో 100 మార్క్ అందుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఇమామ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. పాక్ తరఫున అతి తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ముస్తాఫిజుర్ వేసిన 42వ ఓవర్లో సెంచరీ పూర్తిచేసుకున్న ఇమామ్.. అదే ఓవర్‌లో అనూహ్యంగా హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఆటగాడు బాబర్ అజామ్(96) జట్టు స్కోరు 180 వద్ద పెవిలియన్ చేరాడు. సైఫుద్దీన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 42 ఓవర్లు ముగిసేసరికి పాక్ 3 వికెట్ల నష్టానికి పాక్ 247 పరుగులు చేసింది. ప్రస్తుతం హఫీజ్(26), హరీస్ సొహైల్(0) క్రీజులో ఉన్నారు. అయితే పాక్ సెమీస్ ఆశలు తీరడానికి అవకాశాలు లేవనే అంటున్నారు నిపుణులు.. అంటే గెలిచినా ఉపయోగం ఏమి ఉండబోదు..!

Related posts