telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కు బానిసయ్యాను… కంగనా వీడియో వైరల్

kangana

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్ర‌గ్స్ వ్యవహారంపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి విచార‌ణ చేస్తుంది. ఈ క్రమంలో డ్ర‌గ్స్, నెపోటిజంపై కంగ‌నా ర‌నౌత్ గట్టిగా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో కంగనా కూడా డ్ర‌గ్స్ తీసుకుంటుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎక్కువ శాతం మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు మాద‌క ద్ర‌వ్యాలు తీసుకుంటార‌ని, అలాంటి వారితో సంబంధాలున్న‌ట్లు నిరూపిస్తే.. నేను ముంబై వ‌దిలిపోతాను అంటూ కంగ‌నా సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో కంగ‌నా ర‌నౌత్‌కు సంబంధించిన పాత వీడియో ఒక‌టి నెట్టింట వైరల్ అవుతోంది ఈ ఏడాది మార్చి నెల‌లో ఇంటి వ‌ద్ద ఉన్న కంగ‌నా ఓ వీడియోలో మాట్లాడుతూ “నటి కావాలనే ఉద్దేశంతో నేను చిన్న‌ప్పుడే ఇల్లు వ‌దిలి ముంబై వ‌చ్చేశాను. కొన్ని సంవ‌త్స‌రాల‌కు ముంబైలో సినీ న‌టిగా మారాను. ఈ క్ర‌మంలో నేను ఇబ్బందులు ప‌డ్డాను. ఎంతో మంది చెడ్డ‌వారిని ఫేస్ చేశాను. డ్ర‌గ్స్‌కు కూడా బానిస‌య్యాను. ఇలా నా జీవింతో ఎన్నో జ‌రిగాయి” అన్నారు కంగనా. ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Related posts