telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్తను చితక్కొట్టిన శిల్పాశెట్టి… వీడియో వైరల్

Shilpa-Shetty-with-Family

బాలీవుడ్ హీరోయిన్లు రకరకాల పనులు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. కరోనా లాక్ డౌన్‌తో అన్నిరకాల షూటింగ్స్ బంద్ అయ్యాయి. దీంతో ఇళ్లకే పరిమితం అయిన సెలబ్రిటీలంతా తమలో ఉన్న కొత్త కళల్ని బయటకు తీస్తున్నారు. కొందరు వంటలు చేస్తుంటే.. మరికొందరు వ్యాయామాలు చేసి టైమ్ పాస్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా రకరకాల టిక్ టాక్ వీడియోలు, హెల్దీ రెసిపీలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన భర్త రాజ్ కుంద్రాను చితక్కొట్టిన వీడియో ఒకటి శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది. దీంతో శిల్పా తన భర్త రాజ్ కుంద్రాను కొడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె బట్టలు వెతుక్కుంటుంటే భర్త వచ్చి శిల్పా శెట్టిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. దీంతో వెంటనే ఆమె తనను విసిగించవద్దు అని చెప్తుంది. పక్కనే చీపురు తో ఉన్న పని మనిషి కూడా తాను చెప్తున్నా వినడం లేదని విసిగిస్తున్నాడు అని చెప్పడంతో ఆగ్రహంగా శిల్పా అతని మీద దాడి చేస్తూ ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉండడంతో బాలీవుడ్‌ నటీమణులు టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు.

Related posts