telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో మరో దారుణం..నోట్లో పురుగుల మందు పోసి రేప్

rape

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ళ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను చంపేందుకు బలవంతంగా నోట్లో పురుగుల మందు పోశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. స్కూల్ సెలవులు కావడంతో బాలిక ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో పొలం పనుల కోసం తల్లిదండ్రులు పోయారు. ఒంటరిగా ఉన్న ఆమెను గర్హించిన ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేశారు. పక్కింటి బాలుడు ఈ దారుణాన్ని చూసి కేకలు వేయడంతో పరారయ్యారు. అంతకు ముందే ఆమెను బలవంతంగా గడ్డి మందు తాగించారు. ఈ ఘటనపై పలుగురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.

Related posts