telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్… ఇక క్యూఆర్‌ కోడ్ నెంబర్ సేవ్ ఆప్షన్

whatsup

వాట్సాప్‌ త్వరలోనే సరికొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. సాధారణంగా మనం కాంటాక్ట్‌ నెంబర్‌ ఫీడ్‌ చేయాలంటే కీప్యాడ్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత నెంబర్‌ టైప్‌ చేసి, పేరు కూడా టైప్‌ చేయాలి. ఆ తరువాత నెంబర్ సేవ్‌ చేసుకోవాలి. ఇలా ఒక నెంబర్‌ అయితే ఫీడ్‌ చేసుకోవచ్చు. చాలా నెంబర్లు చేయాలంటే ఒకరోజుతో అయ్యే పనికాదు. ఇప్పుడిక అంత కష్టపడనవసరం లేదు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరి. ఈ ఆప్షన్‌ సెట్టింగ్స్‌లో ఉంటుంది. ప్రతి ఒకరి వాట్సాప్‌కు ఒక క్యూఆర్‌ కోడ్‌ను కేటాయించనున్నది వాట్సాప్‌ యాజమాన్యం. ఎవరి నెంబర్‌ అయితే ఫీడ్‌ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఫోన్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను మీ ఫోన్‌తో స్కాన్‌ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ను త్వరలో యూజర్ల ముందుకు తీసుకురానున్నట్లు వాట్సప్‌ ప్రకటించినది.

Related posts