telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్యాంగ్ లీడర్ : “సీను సిరిగి.. సీట్లు ఇరిగి.. సీటీ కొట్టాలయా…” వీడియో సాంగ్

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇది ఒక రివేంజ్ డ్రామా అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధ‌మైపోయాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. “ఆర్ఎక్స్ 100” ఫేమ్ కార్తికేయ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రమోషనల్ సాంగ్ గురువారం సాయంత్రం విడుదలైంది. “సీను సిరిగి.. సీట్లు ఇరిగి.. సీటీ కొట్టాలయా..” అంటూ సాగే ఈ వీడియో సాంగ్ లో నానితో కలిసి అనిరుధ్ కూడా చిందేశారు. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts