హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల, కోన వెంకట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మలయాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది. ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు “నిశ్శబ్దం” ఫస్ట్ లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సోలో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క… ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.