telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. ఆఫ్గనిస్తాన్ కీలక ఆటగాడికి .. గాయం.. టోర్నీ నుండి నిష్క్రమణ..

afghanistan player out from world cup injury

2019 ప్రపంచకప్‌లో తనదైన శైలిలో విజయాలు సొంతం చేసుకుంటున్న అఫ్గనిస్థాన్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు బిగ్ హిట్టింగ్ ఓపెనర్, వికెట్ కీపర్ మహ్మద్ షాజాద్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 32ఏండ్ల షాజాద్ పాకిస్థాన్‌తో వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. పాక్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా అతని మోకాలికి దెబ్బ తగిలింది. ఆ నొప్పితోనే ఆస్ట్రేలియా, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడాడు.

2015 వరల్డ్ కప్ నుంచి నిలకడగా ఆడుతూ ఆ జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న షాజాద్ టోర్నీకి దూరమవడం అఫ్గాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే. టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఓపెనర్‌గా బరిలో దిగే షాజాద్ చాలా వేగంగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా చాలా మ్యాచ్‌ల్లో అతడు మెరుగ్గా రాణించాడు. అతని స్థానంలో 18ఏండ్ల బ్యాట్స్‌మన్ ఇక్రం అలీ ఖిల్‌ను జట్టుకు ఎంపిక చేశారు. అఫ్గాన్ తరఫున ఇక్రం రెండే రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్ జూన్ 8న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తలపడేందుకు సన్నద్ధమవుతోంది.

Related posts