telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనసూయకు అలాంటి పాత్రలో నటించే అవకాశం ఇప్పటి వరకూ రాలేదట..!

Anasuya

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఒకవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై మంచి అవకాశాలతో దూసుకెళ్తోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. అయితే అందులో ఓ అభిమాని మీరు ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలో ఏది మీకు ఎక్కువ ఛాలెంజ్ గా అనిపించింది అని ప్రశ్నించాడు. దీనికి అందరూ ఆశ్చర్యపోయే విధంగా అనసూయ ఇప్పటివరకు తనకు అలా ఛాలెంజ్ గా ఏ పాత్ర కూడా అనిపించలేదని, తనకు ఎవరు అలాంటి పాత్రలు ఇవ్వలేదు అని చెప్పింది. మరి ఈ భామకు ఆ ఛాలెంజింగ్ పాత్ర ఎవరు ఇస్తారో ? ఎలాంటి పాత్రలు ఛాలెంజింగ్ గా అన్పిస్తాయో చూడాలి.

Related posts