telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఇవి తింటే పురుషులు ఆగలేరుగా…!

నిత్యం మనం దుంపకూరలలో కంద గడ్డలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది అనే రకాలైన పోషక విలువలను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
లాభాలు…
కంద ఒక అద్భుతమైన, బలవర్ధకమైన ఆహారం. దీనిలో విటమిన్‌-ఏ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. తరచూ దీనిని తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు.
కందలో ఉండే పొటాషియం, ఫైబర్‌, సహజమైన చక్కెర మనకు చాలా తక్కువ క్యాలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. అంతేకాకుండా కంద క్యాన్సర్‌ బారిన పండకుండా కాపాడుతుంది.
చిన్న కందగడ్డ ద్వారా దాదాపు మన శరీరానికి 6 గ్రాముల ఫైబర్‌ చేరుతుంది. వీటిని తినడం వల్ల ఒబెసిటి, షుగర్‌ వ్యాధి పడకుండా కాపాడుతుంది.
కంద చంటి పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ మేలు చేస్తుంది. గర్భిణులకు చేసే మేలు అంతా ఇంతా కాదు. పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
పైల్స్‌తో బాధపడేవారు కందని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆ సమస్య మటాష్‌ అవుతుంది.
కంద దేహపుష్టిని కలిగిస్తుంది. అన్నింటికి మించి పురుషులలో వీర్యపుష్టిని కలగజేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

Related posts