telugu navyamedia
క్రీడలు వార్తలు

సచిన్ జీవితంలో తీరని ఆ రెండు కలలు…

సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో తనదైన ఆటతో క్రికెట్‌కే వన్నెతెచ్చాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే ఇంత సుదీర్ఘ కెరీర్ కలిగిన సచిన్ కెరీర్​లో రెండు విషయాల్లో మాత్రం అసంతృప్తి మిగిలిపోయిందట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ‘నా జీవితంలో రెండు విషయాలు కలగానే మిగిలిపోయాయి. మొదటిది.. చిన్నతనం నుంచి సునీల్ గవాస్కర్​ నా బ్యాటింగ్​ హీరో. ఆయనతో కలిసి ఆడలేకపోయానని ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆయన రిటైర్​ అయిన రెండేళ్లకు నేను క్రికెట్​లోకి అరంగేట్రం చేశాను. రెండోది.. సర్​ వివియన్​ రిచర్డ్స్​ నా చిన్ననాటి హీరో. ఆయనతో కలిసి కౌంటీ క్రికెట్​లో ఆడటం నా అదృష్టంగా భావిస్తాను. కానీ.. నేను అరంగేట్రం చేసిన తర్వాత ఆయన రిటైర్​ అయినప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్​లు మాత్రం ఆయనకు ప్రత్యర్థిగా ఆడలేకపోయాను.’అని సచిన్ చెప్పుకొచ్చాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సచిన్.. కెరీర్​లో 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. 200 టెస్టుల్లో 51 శతకాలతో 15,921 పరుగులు చేశాడు.

Related posts