telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

అభినందన్‌ కోసం భారత్ స్పెషల్‌ ఫ్లైట్‌.. నిరాకరించిన పాక్!

Pak Denies Permission Plane For Abhinandan

పాకిస్తాన్‌ ఆర్మీ అదుపులో ఉన్న భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే అభినందన్‌ను పాక్‌ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ ప్రత్యేక విమానాన్ని అక్కడికి పంపడానికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. పాక్‌ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా డిల్లీ తీసుకొచ్చి ఆయనకు వెంటనే వైద్య చికిత్స అందించాలని భారత్‌ భావించినట్లు తెలుస్తోంది. అయితే భారత ప్రభుత్వ ప్రతిపాదనను పాక్‌ తోసిపుచ్చింది.

అభినందన్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన పాక్‌ వాఘా సరిహద్దుల్లోనే అతన్ని భారత్‌కు అప్పగించనున్నట్టు తెలిపింది.అభినందన్‌ను రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దుకు తీసుకురావడం లేక విమానంలో భారత్‌కు తరలించడం అనే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో భారత్‌ మాత్రం రెండో మార్గానికే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. వాఘా సరిహద్దు వద్ద భారీగా ప్రజలు చేరుకుంటారని దీని వల్ల భద్రతా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాయు మార్గంలో ఆయనను స్వదేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వం భావించినట్టుగా సమాచారం.

Related posts