గంగా తరంగ గారాల గమకాలతో
కృష్ణా కిల కిలల కవన కిరణాలతో
పెన్నా పరవళ్ళ యాస ప్రవాహాలతో
గోదారి గోరుముద్దల గుజ్జన కూడుతో
అంతర్వేది లక్ష్మీనరసింహ దీవెనలతో,
పోతానా మాత్యునిభావ భాగవతాలతో
కవి కాళిదాసు కవన పలుకు కులుకులతో
అల్లసాని పెద్దన అల్లరి పద లాలిత్యాలతో
శ్రీనాధుని శృంగార రస రభస కావ్యాలతో
శ్రీకృష్ణదేవరాయ ఆముక్తమాల్యదాలతో,
డిండిమ భట్టు కట్టు కనికట్టు పద కట్టులతో
తెనాలి రామలింగ వికట పద భాజ్యా లతో
విశ్వనాధ అమృత పద విపంచి శరాలతో
బలిజేపల్లి వారి హావ భావకవనా క్షరాలతో
జాషువా వారి జనరంజక జవసత్వ పద్యాలతో,
ఆకశాన అనంత కోటి కాంతుల నక్షత్ర మాలికలై
భువిన తరుల పత్రహరిత సుగంధ కవన ఖండాలై
తూరుపు తొలిపొద్దు కిరణాక్షర కాంతి పుంజాలై
చంటి పిల్లతల్లులకు చందమామ కధలలాలిపాటై
కమ్మని తేనెలొలుకు తీయటి పదమై వెలిగే నా మాతృ భాషై…!!
కరోనా ఎఫెక్ట్… “ఆర్ఆర్ఆర్” మరోసారి వాయిదా