టీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది.. దీనికోసం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ధరణి పోర్టల్‌ను తీసుకువస్తుంది.. ఈ పోర్టల్‌ను ముందుగా దసరా రోజు ప్రారంభిస్తారని ప్రకటించారు… అయితే, అది కాస్తా వాయిదా పడింది.. ఇప్పుడు ముహుర్తం ఖరారు చేసింది టీఆర్ఎస్ సర్కార్.. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నారు.. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు.. ఇప్పటికే ‘ధరణి’ పోర్టల్ ద్వారా భూమి రిజిస్ట్రేషన్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు.. రాష్ట్రంలోని 570 మండలాల్లో తాసిల్దార్లు ఒక్కో మండలంలో 10 రిజిస్ట్రేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వస్తే సరిచేయాలని అధికారులు భావించారు. కానీ, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెబుతున్నారు,, ఈ నెల 29వ తేదీ నుంచి విప్లవాత్మక మార్పులు చూడబోతున్నారు ప్రజలు.. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థను సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
previous post
next post
బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు