telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు…

Revanth-Reddy mp

బీజేపీ అధికార పార్టీ మీద విమర్శల దాడి పెంచింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందన్న పాయింట్‌ తో గ్రేటర్‌ ఎన్నికల్లో దూసుకెళ్లాలని భావిస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం తామేనని.. తమ పార్టీలోకి భారీ వలసలు ఉంటాయన్న ధీమాతో ఉంది బీజేపీ. ఇతర పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దున్నిక ఎన్నికల జోష్‌తో గ్రేటర్‌పై దృష్టి పెట్టింది బీజేపీ. గ్రేటర్ పరిధిలో కొందరు.. చోటా మోటా నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలో మరికొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కాషాయ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరుకు స్థానిక నేతలు భారీగా చేరుతారన్న ధీమాతో కమల దళం ఉంది. దుబ్బాకలో చూపించిన గ్రౌండ్‌ వర్క్‌, యాక్షన్‌ ప్లాన్‌నే గ్రేటర్‌ ఎన్నికల్లో అమలు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కలిసికట్టుగా పనిచేసి.. గ్రేటర్‌లో సత్తా చాటి.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రధాన పోటీ అని చెప్పాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి బీజేపీలో చేరారు. కొప్పుల నర్సింహారెడ్డిని నిన్న కండువా కప్పి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  బీజేపీలోకి ఆహ్వానించారు. కొప్పుల నర్సింహారెడ్డి చేరిన వెంటనే కొప్పులకు మంచి ఆఫర్‌ ఇచ్చింది బీజేపీ. ముషిరాబాద్ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా కొప్పుల బరిలోకి దిగనున్నారు. కొప్పుల నర్సింహారెడ్డి బాటలోనే మరో అనుచరుడు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం అయింది. కాసం రామ్ రెడ్డి కూడా ఈరోజు పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈయన గడ్డి అన్నారం టికెట్ ఆశిస్తున్నారు రాం రెడ్డి. ఇక ఇదేబాటలో మరికొందరు కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది.

Related posts