telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు

ప్రపంచంలోనే అతి విలువైన వస్తువు బంగారం. దీనిని కొనడానికి ఎంతో ఇష్టపడతారు మహిళలు. ధర ఎంత ఉన్నప్పటికీ బంగారం కొనేందుకే ఆసక్తి చూపుతారు. అయితే.. తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత మూడు రోజులు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గాయి. ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 390 తగ్గి రూ. 47,560 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 350 తగ్గి రూ. 43,600 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు భారీగానే తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 45,220 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 41,450 పలుకుతోంది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 500 తగ్గి 69,900గా నమోదైంది.

Related posts