telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సంక్రాంతికి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న స్టార్ హీరోస్…

కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో సంక్రాంతికి తమ అభిమాను హీరోల సినిమాలు విడుదల కానందుకు నిరాశలో ఉన్న అభిమానులను అలరించేందుకు పవర్ స్టార్, రెబల్ స్టార్‌లు ఎదో ప్లాన్ చేస్తున్నారట. అభిమానులకు ఓ పెద్ద సర్‌ప్రైజ్‌తో వారి దాహం తీర్చనున్నారా..? అంటే సినీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. హిందీ పింక్ సినిమాను తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమెక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తుండేది. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో వచ్చే వేసవికి వాయిదా పడింది. దాంతో అభిమానుల్లో నిరాశ పొంగిపొర్లింది. దాన్ని ఎలాగైనా పోగొట్టాలని చిత్ర యూనిట్ సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్‌ను ప్లాన్ చేస్తుంది. ఇదే తరహాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హిగ్దె జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్ టీజర్ విడుదల చేసి అభిమానులకు తీపి కబురు అందించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వార్తతో అభిమానులు ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా టీజర్‌లు విడుదలవుతాయా అని ఉవ్వలూరుతున్నారు. మరి నిజంగానే అభిమానులకు హీరోలు శుభవార్త చెప్తారా… లేదా అనేది చూడాలి.

Related posts