టీడీపీ నేత గంటా విశాఖను ఆర్ధిక రాజధానిగా ప్రకటించాలని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో గతంలో విశాఖలో భూదందా కేసులను మళ్ళీ తోడి గంటాను జైలుకు పంపించే కార్యక్రమం మొదలయినట్టు తెలుస్తుంది. గంటా శ్రీనివాస్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద విమర్శలతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడెందుకో గంట మోగడం లేదు. అసెంబ్లీలో కూడా గంటా నోరు తెరిచి మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ ఎక్కడ తన మీద పగబట్టి కేసుల్లో ఇరికిస్తుందేమో నని గంటా భయపడుతున్నంటున్నారు. అందుకే ఎక్కడ సడి చప్పుడు లేకుండా తన పని తాను చూసుకుంటున్నాడు.
గంటా శ్రీనివాస్ ప్రతి సారి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మారి, ఆ పార్టీలో పదవులు అనుభవించడం గంటా శ్రీనివాస్ కు అలవాటు. అధికార పార్టీలో లేకపోతే గంటా రాజకీయాలు చేయలేనతంగా బలహీనంగా మారిపోతారు. గంటా టీడీపీ నుంచి ప్రజారాజ్యం లోకి చేరి తరువాత కాంగ్రెస్ పార్టీలోకి చేరి క్యాబినెట్ మంత్రి పదవిని కూడా అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయే లోపే .. వెంటనే గంటా 2014 లో టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకొని పదవులను అనుభవించారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ మారకుండా టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు.