telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ : .. రాజధాని మార్పు .. లేనట్టే ..

నేడు జగన్ మంత్రులతో సమీక్ష నిర్వహించి రాజధాని గురించి క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి రాజధాని మార్పు లేనట్టేనని చెప్పాలి. ప్రతి పక్ష పార్టీలు ఈ రాజధాని వ్యవహారాన్ని ఒక రాజకీయ కోణంగా ప్రాజెక్ట్ చేస్తే లభ్ది పొందాలని ఆలోచిస్తున్నారు. దీనితో వైసీపీ పార్టీ అలెర్ట్ అయ్యింది. జగనే స్వయంగా రాజధాని విషయంలో నోరు తెరిసి చెబితే గాని ప్రతి పక్ష పార్టీలు విమర్శలు ఆగేట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా మీడియా డిబేట్ లలో కూర్చొని పెద్ద మేధావులుగా మాట్లాడే వాళ్ళ నోర్లు మూగబోయేటట్లు లేవు. వైసీపీ మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని టీడీపీ నానా హంగామా చేస్తుంది. నిజానికి బొత్స సత్య నారాయణ రాజధానిని మారుస్తన్నామని ఎక్కడ చెప్పలేదు.

బొత్స చెప్పింది కేవలం .. అమరావతికి వరద పోటు ఎక్కువగా ఉందని నిర్మాణాలకు లక్ష రూపాయలు పెట్టే చోట రెండు లక్షలు పెట్టాలిసిన పరిస్థితి వస్తుందని చెప్పారు. అంతక మించి ఇంకేమి చెప్పలేదు. కానీ టీడీపీ మాత్రం తామేదో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించామని దానిని మార్చవద్దని తెగ బాధపడిపోతోంది. ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందని .. దొనకొండకు తరలిస్తారని చంద్రబాబు ఎన్నికల్లప్పుడు ఆరోపించారు. దాని ద్వారా ప్రజల్లో ఓట్లను పొందాలని చూశారు. పచ్చ మీడియా కూడా ఎన్నికలప్పుడు ఇలాంటి గాలి వార్తలే ప్రముఖంగా ప్రచురించి ప్రజల్లో కన్ఫ్యూషన్ ను క్రియేట్ చేయాలని చూశారు. కానీ ఏం జరిగిందో మనం చుసము. ప్రజలు చాలా క్లారిటీగా ఓట్లు వేసి జగన్ ను గెలిపించారు.

Related posts