telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మీ పొగరు గురించి నెటిజన్ ట్వీట్

Rashmi

ప్రముఖ హాట్ యాంకర్ రష్మీ ఒకవైపు యాంకరింగ్ చేస్తూ… అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రష్మీపై మండిపడ్డాడు. సదరు నెటిజన్ ఎయిర్ పోర్టులో రష్మిని కలవగా… రష్మీ తనతో పొగరుగా, దురుసుగా ప్రవర్తించిందని తెలిపాడు. ఈ మేరకు “నిన్న విమానాశ్రయంలో అనుకోకుండా రష్మిని కలిసాను. ఆ సమయంలో ఆమె చాలా దురుసుగా, పొగరుగా ప్రవర్తించారు. ఇది ఆమె భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదు. రష్మి… అందరితో సౌమ్యంగా నడుచుకో… నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై రష్మీ స్పందించింది. “నాకు 24 గంటలుగా నిద్ర లేదు. మూడు విమానాలు మారాను. అందుకే అంత దురుసుగా, పొగరుగా ప్రవర్తించి ఉంటాను. నా కెరీర్‌ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ బాగుంటాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేసింది.

Related posts