telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

చెట్టుకింద .. జొన్నన్నం తింటూ పవన్, ..ఎన్నికల కోసమేనా.. !

janasenani simplicity video viral

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ వీడియో నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన జగన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. జగన్, చంద్రబాబులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు విశ్రాంతి తీసుకున్న పవన్.

తాటి చాపపై కూర్చుని, మట్టి ముంతలో జొన్న అన్నం మజ్జికతో తిని కాసేపు సేద తీరారు. పంచెకట్టులో వేపచెట్టు కింద కూర్చుని జొన్న అన్నం తింటున్న పవన్ వీడియో, ఫొటోలను జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ సింప్లిసిటీకి ఇది నిలువెత్తు నిదర్శనమంటూ ఆయన అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.

Related posts