telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

రిలయన్స్ షోరూంలో అగ్నిప్రమాదం

విజయవాడలోని రిలయన్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బెంజి సర్కిల్ సమీపంలో ఉన్న రిలయన్స్ షోరూం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులో ఫుట్ వేర్ అమ్మకాలు, వస్త్రాల విక్రయం జరుగుతుంటాయి. ఈ ఫ్లోర్ లోనే కార్పొరేట్ ఆఫీసు ఉంటుంది.

అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరగడంతో సగానికి పైగా పాదరక్షలు, బూట్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.

Related posts