telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్ బిల్లులపై స్పందించిన ఏపీ హోం మంత్రి

ap minister sucharita on fluds

ఏపీలో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. విద్యుత్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే రీడింగ్ తీయడం జరుగుతోందని అన్నారు. విద్యుత్ శాఖాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ, విద్యుత్ బిల్లులు పారదర్శకంగా వస్తున్నాయని అన్నారు.

మార్చి నెలలో విద్యుత్ బిల్లులను గత ఏడాది టారిఫ్ ప్రకారం తీస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ నెల బిల్లుల రీడింగ్ ను డైనమిక్ విధానం ద్వారా తీస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విధానం ప్రకారం వినియోగదారులు ఎంత మేరకు విద్యుత్ ను వినియోగించుకున్నారో అంతే బిల్లు వస్తుందని అన్నారు. శ్లాబ్ విధానం కాకుండా డైనమిక్ విధానంలో బిల్లుల రీడింగ్ తీయడం వల్ల వినియోగదారులకులాభం చేకూరుతుందని తెలిపారు. జూన్ 30 నాటికి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా బిల్లులు చెల్లించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

Related posts