telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు స్పెషల్..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంతో మందికి అభిమాన నటుడు అయిన చిరు పుట్టిన రోజు నేడు (ఆగస్టు 22). ఈ సందర్భంగా మెగాస్టార్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Chiranjeevi Old - 1080x608 Wallpaper - teahub.io

మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఆయనకే సొంతం. అంతేకాదు తన అద్భుత నటన, ఆకట్టుకునే డ్యాన్స్‌లతో ఓ తరాన్ని ఊపుఊపారు మెగాస్టార్. ఆయ‌న ఎంతో మంది స్టార్‌ హీరోలకు చిరు ఆదర్శం. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చామని చెప్పే యంగ్‌ హీరోలు చాలా మంది ఉన్నారు.

Chiranjeevi suspends 'Acharya' shoot due to coronavirus threat | Deccan Herald

ఇక సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు చిరు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ల పేరుతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 1998లో మొదలైన చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ సేవలు ఇప్పుడు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అలాగే బిజినెస్ మెన్ గా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ సాధించారు.రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాలకు దూరమయిన మెగాస్టార్ తిరిగి సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చి ‘ఖైదీ నెంబర్ 150’తో తన సత్తా చాటాడు.

Acharya'' pre-release business: Theatrical value of the Chiranjeevi starrer stands at Rs 140 cr worldwide? | Telugu Movie News - Times of India

చిరంజీవి ప్ర‌స్థానం :-

చిరంజీవి 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్ , ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉండేవాడు, నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్.సి.సి లో చేరి 1970 వదశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్ లో పాల్గొన్నాడు.

Megastar Chiranjeevi™ on Twitter: "Megastar with his Parents lovely Pic 😍… "

చిన్నతనం నుంచి నటనమీద ఆసక్తి ఉండేది ఒంగోలు లోని సి. ఎస్. ఆర్. శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. నరసాపురంలోని శ్రీ వై.ఎన్. కళాశాల నుంచి కామర్స్ లో డిగ్రీ పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరాడు.

Pic Talk: Chiranjeevi Wedding Unseen Photo

హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రాంచరణ్ తేజ.

On his birthday, Chiranjeevi receives adorable wishes from his family members.

1978లో వచ్చిన పునాదిరాళ్ళు సినిమాతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది. 1987లో చిరంజీవి నటించిన స్వయంకృషి సినిమా రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.

Punadhirallu httpsiytimgcomviNtQyqBdL6G8hqdefaultjpg

ఈ సినిమాకు గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్ ప్రెస్ బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నాడు. అదే సంవత్సరంలో 59 వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకడిగా వెళ్ళాడు. 1988 లో చిరంజీవి సహ-నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ సినిమా జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది.

Nagma | Cinema Chaat

1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల రూపాయలకు పైగా స్థూల వసూళ్ళు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 1993 లో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శింపబడింది. ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికల ముఖచిత్రంపై ఎక్కాడు. ఫిల్మ్ ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అని శీర్షికలు వెలువరించాయి. ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మెషీన్ గా అభివర్ణించింది.

ఆపద్బాంధవుడు" లో "అమ్మాయి గారు" గుర్తున్నారా.? ఇప్పుడు ఎలా మారిపోయారా చూస్తే షాక్ అవుతారు.!

1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు. అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడూ తీసుకోనంత పారితోషికం.2002లో భారత కేంద్రప్రభుత్వ ఆర్థిక శాఖ 1999-2000 ఆర్థిసంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది. 2006 లో సి.ఎన్.ఎన్. ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తింపు పొందాడు. ఆయ‌న సినీ సంచలనానికి కేంద్రబిందువు, 63 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ ఆయన అభిమానగణం ఎంతమాత్రం తగ్గలేదు.

chiranjeevi with President Abdul Kalam taking Padma Bhusha… | Flickr

చిరంజీవి న‌టించిన సినిమాలు 150 అందులో 100 కి పైగా కమర్షియల్ హిట్లు, 30 కి పైగా బ్లాక్ బస్టర్లు.. అయినా కేవలం సినిమా కలెక్షన్ల గురించి మాత్రమే మాట్లాడుకునే సాధారణ హీరో కాదతడు. ఇక ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన ‘సై రా నరసింహారెడ్డి’ సినిమా టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆచార్య సినిమా ఇప్ప‌టికి పూర్తి చేస‌కున్నారు. ఆ కళామతల్లి ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్ష‌లు తెలుపుదాం..!

Sye Raa Narasimha Reddy box office collection: Day 17

Related posts