హైదరాబాద్ నుంచి సోమవారం బయలుదేరి వెళ్లిన కెసిఆర్.. మంగళవారం వరకూ కేరళలోని కోవలంలోని బీచ్ వద్ద గల రిసార్ట్స్‌లో విశ్రాంతి తీసుకున్నారు. బుధవారం కన్యకుమారికి బయలుదేరి వెళ్లారు. అక్కడి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించిన అనంతరం రాత్రి అక్కడే బస చేశారు. గురువారం ఆయన రామేశ్వరం వెళ్లనున్నారు. సిఎం శుక్రవారం… మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. 11న ఆయన శ్రీరంగం బయలుదేరి వెళతారు. అదే రోజు చెన్నైకు పయనమవుతారు.
ఈనెల 13న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అవుతారు. అయితే స్టాలిన్.. ఎన్నికల సభలు, సమావేశాల్లో బిజీగా ఉన్నందున కెసిఆర్‌తో ఆయన భేటీ ఉండకపోవచ్చని తెలుస్తున్నది. ఎన్నికలు అయి పోయిన తర్వాత వీరు సమావేశమవుతారంటూ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిరువురి సమావేశం ఉంటుందా? ఉండదా? అనేది తేలాల్సి ఉంది.
తనను ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ లు ఏకమయ్యాయి: కవిత