telugu navyamedia
సినిమా వార్తలు

103 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ‘అఖండ’ ..

నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన ‘అఖండ నేటితో 50వ రోజులోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ ప్రభంజ‌నం సృస్టించింది. ఇప్ప‌టికీ తెలుగు రాష్ట్రాలలో 103 కేంద్రాల్లో విజయవంతంగా హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో దూసుకుపోతుంది.

Box Office: NBK's 'Akhanda' Roared Past Rs. 100 Crores Worldwide Gross -  Sacnilk

బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో ఇంతకు ముందు వ‌చ్చిన‌ సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడంతో అఖండ పై సహజంగానే భారీ అంచనాలు పెరిగాయి. బాలయ్య విశ్వరూపం, బోయపాటి మాస్ డైరెక్షన్ థియేటర్లలో ఆడియెన్స్​కు పూనకాలు తెప్పించింది.

Akhanda': All set for grand US Premieres on December 1 - Telugu News -  IndiaGlitz.com

అలాగే బాలకృష్ణ అఘోర పాత్ర చేయడం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్.. సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ‘అఖండ 50వ రోజులో అడుగుపెట్టే సమయానికి థియేటర్లలో గ్రాస్-నాన్ థియేట్రికల్​ హక్కులు మొత్తం కలిపి రూ. 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోయింది.

Akhanda 50 Days

బాలయ్య కెరీర్​లో ఈ మార్క్​ అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతే కాదు టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడలేదు. దీంతో నందమూరి అభిమానులు భారీ ఎత్తున వేడుకలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అఖండ మూవీలో బాల‌య్య‌కు జ‌త‌గా ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే ఈ సినిమా ఈనెల 21 నుంచి అఖండ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Related posts