జబర్దస్త్‌లో తగాదాల కారణంగా షోను విడిచి అదిరిందిలో అడుగు పెట్టారు నాగబాబు. ఆ తర్వాత కొందరు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఆయనతో పాటు వెళ్లిపోయారు. అలాగే గత కొద్ది రోజుల క్రితం హైపర్ ఆది టీంలో చేసే కమెడియన్లు దొరబాబు, పరదేశీలు ఆ మధ్య వ్యభిచారం కేసులో దొరికిపోయారు. దీంతో వీరిని జబర్దస్త్ నుంచి తీసేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా హైపర్ ఆది టీంలో వీరిద్దరూ కనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్లను బయటికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయట. నెక్ట్స్ షెడ్యూల్ నుంచి వీరిని హైపర్ ఆది టీంలో తీసుకోవద్దని మల్లెమాల టీం చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ వీరితో ఉన్న అగ్రిమెంట్ కారణంగా వీరిని కొనసాగించినట్టు సమాచారం. అలాగే వీరు ఇప్పుడు అదిరింది కామెడీ షోకి జంప్ అయినట్లు కూడా మరో ప్రచారం కూడా జరుగుతోంది.
previous post
next post