బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ వరుస హిట్లతో భారీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు కొట్టేసింది. ప్రస్తుతం అలియా “బ్రహ్మాస్త్రా”, “ఆర్ఆర్ఆర్”, “ఇన్షా అల్లా” వంటి క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. అయితే అలియా కొద్ది రోజులుగా పేగులకి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడంతో న్యూయార్క్‌లో చికిత్స తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అలియా ఒప్పుకున్నా భారీ ప్రాజెక్టుల షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆలస్యం కానుంది. ముఖ్యంగా రాజమౌళి “ఆర్ఆర్ఆర్” టీంతో అలియా మరి కొద్ది రోజులలో జాయిన్ కావలసి ఉంది. కాని ఆమె అనుకోకుండా న్యూయార్క్ వెళ్లవలసి వస్తుండడంతో “ఆర్ఆర్ఆర్” చిత్ర షెడ్యూల్స్‌లో పలు మార్పులు చేస్తున్నారట రాజమౌళి. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాల బారిన పడడం వలన చిత్ర షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక అలియా వలన వాయిదా పడ్డ “బ్రహ్మాస్త్రా” చిత్ర షూటింగ్ కోసం రణ్‌భీర్ కపూర్ కొన్నాళ్ళ పాటు ఎక్స్‌ట్రా కాల్షీట్స్ కేటాయించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విధంగా అలియా వలన ఈ భారీ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి.
next post
చిరంజీవితో సినిమా ఆగిపోవడానికి అసలైన కారణం… సీక్రెట్స్ వెల్లడించిన వర్మ