దేశవ్యాప్తంగా భారీ వర్షాల దెబ్బకి పల్లెలు, పట్టణాలు చెరువులను తలపిస్తూ, ప్రజల సాదరణ జీవనశైలికి అడ్డంకిగా మారిపోయింది. దీనితో విపత్తు నిర్వహణ వారు రేయింబవళ్లు సేవలు చేసినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. దీనితో ఇతర శాఖలకు తిప్పలు తప్పడంలేదు. తాజా పరిస్థితులను ఒక ట్రాఫిక్ పోలీసు తనదైన శాలిలైలో ఎదుర్కొని, ట్రాఫిక్ పోలీసులు అంటే కేవలం వాహనాల రాకపోకలను నియంత్రించడం మాత్రమే కాదని, రోడ్డు మీద వెళ్లే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడమని నిరూపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో బెంగుళూరులో జరిగింది. బెంగళూరులో చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ నీటితో నిండిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు, నడిచి వెళ్లే వారికి చాలా ఇబ్బందిగా మారింది.
దీనిని గమనించిన ఓ పోలీస్ అధికారి స్వయంగా తానే పార చేత పట్టుకొని రోడ్డు మీద నిలిచిన నీరు పోయేందుకు దారిని చదును చేశాడు. నీరు పక్కకు వెళ్లి కాస్త రోడ్డు కనిపించడంతో వాహనదారులు ఇబ్బంది లేకుండా ప్రయాణించారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారనేది అనేది స్పష్టత లేదు. ఆ పోలీసు అధికారి ఎవరు అనేది కూడా తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని సోషల్ మీడియాలో పెట్టిన కొద్ది గంటల్లోనే 35,000 మందికి పైగా ఈ వీడియోను చూశారు. వీడియోను చూసిన బెంగళూరు పోలీసు కమిషనర్ ‘మా కుర్రాళ్లు మీ పట్ల బాధ్యతయుతంగా ఉంటున్నారు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే వారి సహనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని చంద్రబాబు పారిపోయారు: మోత్కుపల్లి