telugu navyamedia
సినిమా వార్తలు

రా .. వెన్నెల్లో వర్షంలా ’ మెలోడి సాంగ్‌ రిలీజ్ చేసిన సామ్..

యంగ్‌ హీరో నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన రొమాంటికి అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్‌.. తాజాగా ఈ మూవీ నుంచి ‘వర్షంలో వెన్నెల’ అనే రొమాంటిక్​ సాంగ్​ను రొమాంటిక్‌ సాంగ్‌ని స్టార్‌ హీరోయిన్‌ సమంత విడుదల చేసింది.‘బ్యూటిఫుల్‌ సాంగ్‌ విత్‌ బ్యూటిఫుల్‌ పీపుల్‌’అంటూ ట్వీట్‌ చేస్తూ సామ్‌ ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్‌ లింక్‌ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

Krishna Vrinda Vihari: First lyric from Krishna Vrinda Vihari movie ..  Moonlight song release in the rain just then .. | Naga Shaurya Movie  Krishna Vrinda Vihari First Song Varshamlo Vennella Release

‘రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా .. అంటూ సాగే ఈ రొమాంటిక్‌ సాంగ్‌ని ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే ఆలపించగా, మహతి స్వరసాగర్‌ అద్భుత సంగీతాన్ని అందించాడు.

కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు.. ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్‌ వెళ్తాడు. ఆ తర్వాత ప్రేమలో పడిన అతని ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా ఓ కొత్త రకమైన పాత్రలో కనిపించనున్నారు. సీనియర్‌ నటి రాధిక బలమైన పాత్రలో కనిపిస్తారు.

Krishna Vrinda Vihari': Promo for romantic song launched - Telugu News -  IndiaGlitz.com

వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయిశ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్‌ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులు.

Related posts