దిలిజిత్ దోసాంజ్ ఈ పేరు దాదాపు అందరికి సుపరిచితమే. దిలిజిత్ బాలీవుడ్‌లో తన పాటలతో ప్రేక్షుకలను మైమరిపించారు. అంతేకాకుండా 2010లో మెల్ కరాదే రబ్బా అనే సినిమాతో తనలోని నటుడిని అందరికి పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఎన్నో మంచి సినిమాలను బాలీవుడ్ ప్రజలకు అందించాడు. తన ప్రతిభతో బాలీవుడ్‌లోని అగ్ర గాయకులలో పేరును సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల పార్తమెంటులో మూడు కొత్త వ్యవసాయ బిల్లులకు ఆమోదం వచ్చిన తీరు తెలిసిందే. అవి ప్రస్తుతం చట్టాలుగా కూడా మారాయి. దాంతో హర్యానా, పంజాబ్‌కు చెందిన రైతులు ఢిల్లీ చలో నిరసనను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుల విషయంలో చాలా మంది సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నిరసనలో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని విమర్శంచింది మాత్రం దిలిజి ఒక్కడే. దీనికి కారణం ఇటీవల కాంట్రవర్సీ క్వీన్ కంగనా చేసిన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. నిరసనలో ఒక మహిళను చూపి ఆమె నిరసనను సపోర్టు చేయడానికి వందరూపాయలకు తీసుకొచ్చారని కంగనా అంది. అప్పటి నుంచి దిలిజిత్ రైతులకు తన సపోర్ట్‌ను తెలిపడం మొదలు పెట్టాడు. ఇతడు కంగనా తన తప్పును ఒప్పుకొని రైతులకు మద్దతు తెలిపేలా దిలిజిత్ చేశాడు. అంతేకాకుండా నిరసనలో బాగస్వామ్యం తీసుకున్నాడు. అందులో భాగంగా తాను మాట్లాడాడు. ఈ రైతులు తమ డిమాండ్స్‌ను తీర్చుకునేందుకు వచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వారి హక్కు. వారికి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. వారికి మద్దతు తెలపమని అన్నాడు. దీంతో పాటు ఇటీవల అక్కడ ఉన్న రైతులకు వెచ్చదనం అందించేందుకు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశాడు. దీనిపై పంజాబ్‌కు చెందిన ఓ గాయకుడు స్పందించాడు. రైతుల కోసం నిలబడినందుకు కృతజ్ఞతలంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా నువ్వు ఇంత చేసి కూడా ఎటువంటి పబ్లిసిటీ చేసుకోలేదు, అదీ కేవలం పది రూపాలు ఇచ్చి గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో నువ్వు ఇలా చేయడం భావితరాలకు స్ఫూర్తి నిస్తుందని అన్నాడు.
previous post