తెలుగులో సంచలన విజయం సాధించిన “అర్జున్‌రెడ్డి” రీమేక్ “కబీర్‌సింగ్”తో క్రేజీ స్టార్ హీరోగా మారిపోయాడు షాహిద్ కపూర్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘కబీర్‌సింగ్’ బాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ‘కబీర్‌సింగ్’ తర్వాత ‘జెర్సీ’ రీమేక్‌లో నటించేందుకు షాహిద్ పచ్చజెండా ఊపాడు. దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన్నాను తీసుకోవాలని చిత్రయూనిట్ భావించింది. ఈ మేరకు రష్మికతో చర్చలు కూడా సాగించినట్టు సమాచారం. అయితే రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో రష్మిక ఈ సినిమా చేయడానికి ‘నో’ చెప్పిందట. అలాగే రష్మిక డేట్లు కూడా ఖాళీగా లేవట. దీంతో నటి మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రబృందం ఫిక్సయిందట. ఇప్పటికే తెలుగు ‘జెర్సీ’ చూసిన మృణాల్ హిందీ వెర్షన్‌లో నటించేందుకు ఓకే చెప్పేసినట్టు సమాచారం.
next post