మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. మొదట సినిమాతోనే అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్‌లోని అందరూ అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది.
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోందీ. సీటీమార్, ఘని, మేస్ట్రో, ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం, దట్ ఈజ్ మహాలక్ష్మి, ప్లాన్ ఏ ప్లాన్ బీ వంటి సినిమాలతో బిజీగా గడుపుతోంది.
మరోవైపు సినిమాలు , వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న స్టార్ బ్యూటీ తమన్నా .. మాస్టర్ చెఫ్ తెలుగు వెర్షన్ తో త్వరలో బుల్లితెరపై కూడా హోస్ట్ గా మారనున్నారు. ఇప్పుడు తమన్నా ఒక రచయితగా కూడా తన ప్రతిభను చాటనున్నారు. ఈ మధ్యనే “బ్యాక్ టు ద రూట్స్” అనే ఒక ఆంగ్ల నవలకు సహ రచయిత్రిగా పనిచేశారు తమన్నా. ప్రముఖ లైఫ్ స్టైల్ కోచ్ లుక్ కౌటిన్హో తో కలిసి తమన్నా పుస్తకాన్ని పూర్తి చేశారు.
గతంలో “ది గ్రేట్ ఇండియన్ డైట్ విత్ శిల్పాశెట్టి” మరియు “ది మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్ విత్ అనుష్క శెట్టి” వంటి బెస్ట్ సెల్లర్ నవలలకు రచన చేసిన లుక్ ఇప్పుడు తమన్నా తో కలిసి “బ్యాక్ టు ద రూట్స్” అనే నవలను విడుదల చేశారు. పాతకాలంలో మనదేశంలో సాధన చేసిన కొన్ని పద్ధతులు, రోగాలను నియంత్రిస్తూ అప్పటివారు తినే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల చుట్టూ ఈ నవల తిరుగుతూ ఉంటుందట.
హీరోయిన్లపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు