telugu navyamedia
సినిమా వార్తలు

నా కవిత…

Hrudaya kovela poetry corner
ఆకాశ వీధిలో అందాలతారను కాను నేను.. 
అమవాస్య రాత్రిలో మిణుగురును నేను…
ఆకలి కేకలు ఆర్తనాదాన్ని..
ఆవేదన లిఖించిన అద్భుత పర్వాన్ని…
నిరాశల జడివానలో 
తడుస్తున్న కఠిన శిలను నేను..
ఎడారిలో మండుటెండను..
సముద్రంలో ఉప్పునీరును..
సమస్యల సుడిగుండాలలో చిక్కిన సమిధను..
అందానికి తప్ప పూజకు పనికిరాని పిచ్చి గడ్డిపువ్వును..
కల్మషం ఎరుగని పసిపాప నవ్వును…
పెదవిపై చిరునవ్వును కాను..
కనులనుండి ప్రవహించే కన్నీరును నేను…
కరిగిపోయి అరిపోయిన కర్పూరపు సువాసన నేను..
కోవెల ముందు గంటను కాను..
నీలాకాశంలో స్వేచ్ఛగా విహరించే కొంగను నేను..
పంజరంలో బంధిచి జ్యోతిష్యం చెప్పించే రామచిలుకను కాను..
ఆదరణ కరువైన అక్షరకవితను నేను…
రంగుల హంగులు చలనచిత్రాన్ని కాను…
మరణం తెలియని ప్రేమను నేను…
క్షణికవేశం కలిగించే కామాన్ని కాను…
అందరి పాపాన్ని ఆనందంగా మోసే అవని నేను…
అంతం తెలియని నింగిని కాను…
జగతిసిగలో పూసిన పున్నాగపువ్వును నేను…
అమనికోసం ఎదురుచూసే కోకిలను కాను….
కష్టంలో పండించే వరిపైరును నేను…
ఎవరు పెంచక పెరిగే పచ్చిగడ్డిని కాను…
కనిపించక జీవాన్ని అందించే ప్రాణవాయువు నేను…
కనిపించక వినిపిస్తూ బాధించే కీచురాళ్ల శబ్దాన్ని మాత్రం కాను..
ముచ్చటైన మూడుముళ్ల బంధాన్ని నేను…
మూడు రోజుల మురిపెంతీరినక తీసుకునే  విడాకులు మాత్రం నేను కాను…
కరిగిపోయే పరువాన్ని నేను…
కరిగిపోయే స్వప్నాన్ని కాను..
నాన్నలోని నమ్మకం నేను..
అమ్మలోని కమ్మదనం నేను..
-దూడపాక శ్రీధర్,
మంథని

Related posts