telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెడ్ : ప్రీ క్లైమాక్స్ లో అభిమానులకు రామ్ సర్ప్రైజ్

red

ఇటీవలే “ఇస్మార్ట్ శంకర్”తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో రామ్. ఆయన ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమాని చేస్తున్నాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ లుక్ పై ఓ వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అందరిని మెస్మరైజ్ చేస్తుందని సమాచారం. ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే రామ్ ఊర మాస్ లుక్ లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల అవుతుండటంతో సుమారు 30 కోట్లకు పైగానే ‘రెడ్’ కోసం ఓ ఓటీటీ సంస్థ ఆఫర్ ఇచ్చిందట. కానీ మేకర్స్ మాత్రం సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పారట. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

Related posts