telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య కేసు : బీహార్ పోలీస్ అధికారిని బలవంతంగా క్వారంటైన్ కు…!

Bihar DGP

జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పటికే విచారించారు. అటు బీహార్ పోలీసులకు కూడా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై అతని తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో వివాదాస్పద పరిణామం చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేసేందుకు ముంబైకి వచ్చిన బిహార్ పోలీసు అధికారి వినయ్ తివారీని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కు తరలించారు. అతడిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది. కాగా ఈ ఘటన పై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్వీట్ చేసారు. తివారీకి వసతి కల్పించాలని తాము కోరినా, అతని చేతికి క్వారంటైన్ స్టాంపు వేసి క్వారంటైన్ చేశారని డీజీపీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా పై ఫిర్యాదు చేయటంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసుపై విచారణ జరపాల్సి వచ్చింది. దాంతో రెండు ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తుంది. ఇక సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని ఇప్పటికే చాలామంది ప్రముఖులు సైతం ఆరోపించిన సంగతి తెలిసిందే.

Related posts