telugu navyamedia
సినిమా వార్తలు

మొగ్గలు..

gaddi puvvu poetry corner
గుండెల్లో నిత్యం ఎన్నో బాధల గునపాలు దిగుతున్నా
పెదవులపై చిరునవ్వులను వెలిగిస్తూనే ఉంటాను
బాధలు జీవితాన్ని రాపిడిపట్టే అసలైన వజ్రకవచాలు
కళ్ళల్లో ఎన్నో కన్నీటి సముద్రాలు పొంగిపొర్లుతున్నా
ముఖంలో నిట్టూర్పులను కనుమరుగు చేస్తుంటాను
వేదనలు జీవనతీరాన్ని చేర్చే అనంతమైన కెరటాలు
మదిసాగరంలో ఆటుపోట్ల అలజడులు రేగుతున్నా
మనసులో బాధఛాయలను కప్పిపెడుతూనే ఉంటాను
జీవితంలోని కష్టాలు కనురెప్పల్లో దాగిన కడగండ్లు
వసంతంలాంటి జీవితంలో శిశిరగ్రీష్మాలు ప్రవేశిస్తున్నా
హేమంతశరత్ రుతువుల్లా వెన్నెలై వెలుగుతుంటాను
ఆరురుతువులు జీవితంలో వచ్చే వెన్నెలవడగాడ్పులు
కలికాలపు సుడిగుండంలో క్షణాలన్నీ కొట్టుకుపోతున్నా
రోజూ జీవితాన్ని ఎండమావిలా గడుపుతూ ఉంటాను
కష్టాలు సుఖాలు కాలానికి పూచిన ఎండిపోని పూలు
                                         – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

Related posts