telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ 6: చిల్‌ బ్రో అంటూ ఎంట్రీ ఇచ్చిన సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభమైంది. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.

మూడో కంటెస్టెంట్ గా శ్రీహాన్ మాస్ డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా అలరించిన సిరి బాయ్ ఫ్రెండే శ్రీహాన్. అప్పుడు సిరి కోసం బిగ్ బాస్ స్టేజ్ పై అతిథిగా వచ్చిన ఇతడికి ఇప్పుడు కంటెస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది. ‘

సిరి సీజన్ చూసి కూడా ఎలా ధైర్యంగా వచ్చావ్’ అంటూ సరదాగా ప్రశ్నించారు నాగార్జున. దానికి శ్రీహాన్.. ‘సిరి ఏదైతే కోల్పోయిందో అది సాధించి వెళ్లాలనుకుంటున్నాను’ అని బదులిచ్చారు.

కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరినీ ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు నాగార్జున. శ్రీహాన్ సెలెక్ట్ చేసుకున్న కార్డు గుంట నక్క. దానికి అర్ధం ఏంటో తరువాత చెబుతానని అన్నారు నాగార్జున.

Related posts