telugu navyamedia
సినిమా వార్తలు

ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా ..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ ముగిసింది. సుమారు 10 గంటల పాటు పూరీని ఈడీ అధికారులు విచారించారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై ఈడీ ప్రశ్నించింది. ఈడీ కార్యాలయంలో పూరి విచారణ ఉదయం 10.17నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. పూరీని మరోసారి విచారణకు పిలిచే అవకాశం వుంది.

Tollywood Drugs Case: ED Begins Questioning With Puri Jagannadh

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల తో ఉన్న సంబంధాల పై ఈడీ ఆరా తీసింది. విదేశాల నుండి డ్రగ్స్ కొనుగోళ్లు ఏ రూపంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న అంశాల పై వివరాలు సేకరించింది. పూరీ జగన్నాథ్ కు సంబంధించి ఆ మూడు బ్యాంక్ ఎకౌంట్ల ను ఈడీ పరీశీలించింది.

పూరి జగన్నాథ్ కు సంబంధించిన వైష్ణో బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రీపోర్ట్ లను పరీశీలించిన ఈడీ.. అడిట్ రీపోర్ట్ వివరాలు సేకరించింది. గతంలో అరెస్ట్ అయిన నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా పూరీని ఈడీ ప్రశ్నించింది. పూరీ స్టేట్ మెంట్ ను లిఖిత పూర్వకంగా ఎనిమిది పేజీల స్టేట్మెంట్ ను నమోదు చేసుకున్న ఈడీ .. ఎప్పుడు పిలిచిన విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది.

దీంతో తాను విచారణకు సహకరిస్తానని.. కచ్చితంగా హాజరవుతామని పూరి జగనాథ్మీ హామీనిచ్చినట్లు సమాచారం.. కాగా పూరి జగన్నాధ్ ను Pmla యాక్ట్ సెక్షన్ 3.4 ప్రకారం ఈడీ అధికారులు విచారించారు. అలాగే ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన రెండు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై అధికారులు విచారణ చేయగా.. తాను సినిమా షూటింగ్ నిమిత్తం ఆ లావాదేవీలు జరిపినట్టు గా పూరి జగన్నాథ్ సమాధానమిచ్చారు. దీంతో ఈ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు.

Drugs case: ED to begin questioning Tollywood personalities on Tuesday

కాగా..ఆయనతో పాటు కుమారుడు ఆకాష్‌ పూరీ, సోదరుడు సాయిరాం శంకర్, న్యాయవాది, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) సతీష్‌ వచ్చారు. ఈడీ విచారణ ఎంతసేపు జరుగుతుందో తెలియక వీరంతా తమ వెంట ఆహారపానీయాలు తెచ్చుకున్నారు. వీరి వెంట కొందరు సహాయ దర్శకులు, అభిమానులు సైతం అక్కడకు చేరుకున్నారు. పూరీతో పాటు ఆయన కుటుంబీకులు, న్యాయవాది, సీఏలనే ఈడీ అధికారులు కార్యాలయంలోకి అనుమతించారు. పూరీని ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి ప్రశ్నించారు.

Related posts