telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎఫ్3 మూవీ.. అవన్నీ పుకార్లేనట..

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు ప్రధాన పాత్రలుగా ఎఫ్2 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎఫ్2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. దాంతో వీరు ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారు. దాంతో మళ్లీ అందరూ దీనికోసం సిద్దమయ్యారు. ఎఫ్2 సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు రానున్న ఎఫ్3 సినిమాకు కూడా నిర్మాతగా దిల్ రాజు చేసేందుకు ఓకే అన్నాడు. అయితే ఇటీవల ఈ సినిమాపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. హీరోలు భారీగా పారతోషికం అడుగుతున్నారని, వరుణ్ వెంకీతో సమానమైన పాత్ర నిడివి కోరుతున్నాడని, దర్వకుడు అనిల్ కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వాటన్నింటికి చెక్ చెప్పింది చిత్ర యూనిట్. అవన్నీ అబద్దాలని, కేవలం పుకార్లేనని అంది. ఈ సినిమా చేసేందుక వరున్ తేజ్, వెంకటేష్ ఇద్దరూ చాలా ఆసక్తిగా ఉన్నారని, ఎఫ్2కు కొనసాగింపుగా కాకుండా మరో కొత్త కథతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అంతేకాకుండా ఈ సారి మరో హీరోను కూడా సినిమాలో చూపించనున్నారు. కుదిరినంత త్వరగా సినిమాను ప్రారంభించనున్నారని, సాధ్యమైనంత వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేస్తామని తెలిపారు.

Related posts