telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేసీఆర్ బయోపిక్ ట్రైలర్..

udyama simham movie trailer

బయోపిక్ కాలంలో చాలా మంది జీవితాలు వెండితెరను అలంకరించాయి. అదే పంధాలో తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితాన్ని కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఆకట్టుకునే డైలాగ్స్ తో ట్రైలర్ అందరి మనసులను గెలుచుకుంటుంది. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న కేసీఆర్ బయోపిక్ లో నటరాజన్, పీఆర్ విఠల్, సూర్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి అల్లూరి కృష్ణం రాజు దర్శకత్వం వహిస్తుండగా, దిలీప్ బండారి సంగీతాన్ని అందించారు. పద్మనాయకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ 29న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా ప్రధానంగా కేసీఆర్ చేసిన ఉద్యమ ప్రస్థానాన్ని చూపించనున్నారు. అదే ట్రైలర్ లో కూడా కనిపిస్తూ, చిత్రంపై అంచనాలను పెంచుతుంది. అయితే ఎన్నికల కోడ్ అమలు లో ఉండగా ఈ చిత్రం విడుదల అవుతుందా అనేది ప్రశ్నగా ఉంది. ఏమంటే ఇటీవల వర్మ చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల కోడ్ ఉండటంతో మొదటి విడత ఎన్నికల అనంతరం విడుదల చేసుకోవాలని సూచించింది ఈసీ. మరి ఈ చిత్రం గురించి ఏమవుతుందో చూడాల్సి ఉంది.

Related posts