telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాగార్జున కొత్త సినిమాలో భూమిక…?

కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. అందులోనూ ఆ సినిమాలో నాగ్ పోషించిన బంగార్రాజు పాత్ర ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ పాత్ర పొందిన ఆదరణకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమా సీక్వెల్‌కు నాగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సీక్వెల్ గురించి గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కేందుకు సిద్దమయింది. అంతేకాకుండా ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కనుందన్న విషయం కూడా తెలిసిందే. అయితే మొదట ఇందులో నాగచైతన్య నటిస్తున్నాడు అని వార్తలు వచ్చిన ఇప్పుడు చైతన్య తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇక ఈ సినిమాలో మరో సీనియర్ యాక్టర్ కూడా నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో భూమిక కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జులై నుంచి మొద‌లుకానుంది. నాగ్ చేసిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించడంతో ఇప్పుడు రానున్న బంగార్రాజు సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.

Related posts