నటి ప్రియ భవాని శంకర్ ఎస్‌జే సూర్య సరసన జోడీగా నటించేందుకు మొదట భయపడ్డానని తెలిపింది. ఎస్‌జే సూర్య, ఆమె హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాన్ స్టర్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన (శుక్రవారం) విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”కథ విన్న వెంటనే దర్శకుడు హీరోగా ఎస్‌జే సూర్యను అనుకుంటున్నామని చెప్పారు. నేను వెంటనే కొంత ఆలోచించసాగాను. వెంటనే దర్శకుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పి వెళ్లిపోయారు.
మూవీ అంతా కామెడీ ట్రాక్ ఎక్కువ కాబట్టి రొమాన్స్ సన్నివేశాలు పెద్దగా ఉండవు అనుకుని చేస్తానని చెప్పేసా. ఎందుకంటే ఎస్‌జే సూర్య నటించిన గత సినిమాల్లో రొమాన్స్, హాట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేవి, అందుకే ఆయనతో నటించాలనగానే కొంచెం భయమేసింది. తరువాత షూటింగ్ శరవేగంగా జరిగింది. ఆయన చాలా మంచి మనిషి, నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. మొట్టమొదటిసారిగా ఆయన నటించిన చిత్రానికి సెన్సార్ నుంచి యూ సర్టిఫికేట్ వచ్చిందంటే చూడండి. సో పిల్లలు, పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. అదే ఎస్‌జే సూర్యతో మరో అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని ఆమె తెలిపింది.