telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అల్లుడు అదుర్స్’లో మెరిసిన న‌భాన‌టేశ్..

బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లోకి హీరోగా అల్లుడు శ్రీను సినిమాతో పరిచయమైనా విషయం తెలిసిందే. తన మొదటి సినిమా నుంచే గొప్ప నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తనదైన కథల ఎంపికతో తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రియల్ హీరో బిరుదు అందుకున్న సోనూ సూద్ కూడా కనపించనున్నాడు. ఈ సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమాన్యుయల్ నటిస్తుండగా, జాతీయ స్తాయి నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే… తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా నుంచి “హోలా చికా” అనే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటలో బెల్లంకొండ కౌబాయి గెటప్‌లో కనిపించి అలరించాడు. హోలా చికా అంటూ పాట మొదలు కాగా… ఇందులో లిరిక్స్‌ అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సాంగ్‌ నభా నటేష్‌ తన అందచందాలతో అలరిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్‌ సారధ్యంలో రూపొందిన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts