telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిల్ రాజు చేతికి “పింక్” రీమేక్ రైట్స్

SVC40

బాలీవుడ్‌ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పింక్’ అక్కడ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని తమిళ్‌లో అజిత్ రీమేక్ చేశారు. అందులో శ్రద్ధా శ్రీనాథ్, తాప్సీ నటించిన పాత్రలో నటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రిమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కున్న 40వ సినిమా ఇది కావడం మరో విశేషం. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్‌ ప్రారంభం కాగా, థమన్ ఓ అద్భుతమైన ట్యూన్ అందించాడంటూ.. సంస్థ ట్వీట్ చేసింది. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీగా ఉంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నివేధా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు కూడా రూమర్లు వస్తున్నాయి.

Related posts