telugu navyamedia
సినిమా వార్తలు

‘పుష్ప ‘సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో స్టార్‌ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక.. శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, దాక్కో దాక్కో సాంగ్ మంచి సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది.

తాజాగా ‘పుష్ప’ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే’ అంటూ సాగే పూర్తి పాటను తాజాగా చిత్రబృందం సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది. తన ప్రేయసి శ్రీవల్లి(రష్మిక) చూపులకు ముగ్ధుడై.. ఆమెపై తనకున్న ప్రేమను పుష్పరాజ్‌ తెలియజేస్తున్నట్లు ఈ పాటను తీర్చిదిద్దారు.

అలాగే బన్నీ పూర్తిగా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూ.. వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో రష్మిక గ్రామీణ యువతిగా కనిపిస్తున్న లుక్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. దేవిశ్రీ స్వరాలు అందించగా సిద్ధ్‌ శ్రీరామ్‌ ఈ పాటను అలపించారు.

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

Related posts