telugu navyamedia
సినిమా వార్తలు

అవునా… సమంత తల్లి కాబోతోందా ?

Samantha

స‌మంత, నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లలో నటించిన “ఓ బేబీ” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సీనియర్ నటి ల‌క్ష్మీ, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్నాయి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే తాజాగా త‌న ట్విట‌ర్ హ్యాండిల్‌ను “బేబీ అక్కినేని”గా మార్చుకుంది. దీంతో స‌మంత త‌ల్లి కాబోతోందంటూ ప‌లు వెబ్‌సైట్‌ల‌లో వార్త‌లు వ‌చ్చేశాయి. ఈ వార్త‌ల‌పై స‌మంత సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. “స‌మంత త‌ల్లి కాబోతోందా?` అంటూ ఓ వెబ్‌సైట్ రాసిన వార్త‌ను రీట్వీట్ చేసిన స‌మంత `అవునా? ఆమె త‌ల్లి కాబోతోందా? ఈ విష‌యం మీకెప్పుడు తెలిసిందో మాకు కాస్త‌ చెప్పండి” అంటూ కామెంట్ చేసింది. దీంతో స‌మంత ప్రెగ్నెన్సీ వార్త‌లు కేవ‌లం పుకార్లేనని తేలిపోయింది.

Related posts