telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మేనిఫెస్టోలోని ఓ అంశానికి సంబంధించిన పెన్షన్‌ ఫైల్‌పై సంతకం తొలి చేశారు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఎన్నికల్లో ‘మా’ ప్రెసిడెంట్​ పదవి కోసం పోటీపడిన ప్రకాశ్​రాజ్​పై నెగ్గిన విష్ణు.. ఫిల్మ్​నగర్​లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్​ భవనంలో బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీతో పాటు, విష్ణు ప్యానెల్​ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Image

కాగా..నరేష్ నుంచి నూతన బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి మా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.అయితే ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ‘మా’ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి’ అంటూ మంచు విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది కూడా హాట్‌ టాపిక్‌గా మారింది.

Related posts